Heroine Rambha: 90వ దశకంలో తన గ్లామర్‌తో యువకులను మంత్రముగ్ధులను చేసిన రంభ, తాజాగా వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలు కన్న తర్వాత సినిమాల నుంచి గ్యాప్ తీసుకొని, టీవీకి పరిమితం అయిపోయింది. కొన్ని డ్యాన్స్ షోలు, కామెడీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ వస్తోంది.
ఇది కూడా చదవండి: Prabhas: ప్రభాస్ తో భాగ్యశ్రీ రొమాన్స్?
ఆమెకు తల్లి, వదిన పాత్రలు ఆఫర్ చేసినప్పటికీ.. ఎందుకనో సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అలాంటిది.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత, అది కూడా 50 ఏళ్లకు దగ్గరవుతున్న రంభ మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమంటూ తెలుస్తుంది.ఇక ఇన్నాళ్ల తర్వాత ఆమెను క్యాస్ట్ చేసుకోవడానికి దర్శకనిర్మాతలు ఎంత ఆసక్తి చూపుతారనేది చర్చగా మారింది.మరి ఈ లేటు వయసులో ఆమెకు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.
యమదొంగ వీడియో సాంగ్స్ చుడండి :