Earthquake: నేపాల్ హిమాలయ పర్వత ప్రాంతంలో మరోసారి భూకంపం సంభవించింది. మన మిత్రదేశం నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున భూమి కంపించింది, దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు భయంతో ఉలిక్కిపడ్డారు. రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రత నమోదైంది.
ఈ భూకంప ప్రభావం భారతదేశంలోని బిహార్, బెంగాల్, సిక్కిం, అసోం సహా టిబెట్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో కూడా కనిపించింది. నేపాల్‌లో భూకంపం సంభవించడానికి 24 గంటల ముందు అసోంలోనూ భూప్రకంపనలు వచ్చిన విషయం గమనార్హం, ఇది మరింత కలవరపెడుతోంది.
Also Read: Udaan Yatri Cafe: రూపాయలకే టీ.. 20 రూపాయలకే వడ.. ఎయిర్ పోర్ట్ లో స్పెషల్ క్యాంటీన్
భూకంపం హిమాలయ ప్రాంతంలోని నేపాల్ సింధుపాల్‌చౌక్ జిల్లా కేంద్రంగా నమోదు అయ్యింది. ప్రకంపనలు భయపెట్టడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతం వరకు ప్రాణనష్టం లేదని అధికారులు వెల్లడించారు. భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
