Udaan Yatri Cafe

Udaan Yatri Cafe: 10 రూపాయలకే టీ.. 20 రూపాయలకే వడ.. ఎయిర్ పోర్ట్ లో స్పెషల్ క్యాంటీన్

Udaan Yatri Cafe: విమానం ఎక్కాలంటే టికెట్ వేలల్లో ఉంటుంది. తప్పనిసరి పరిస్థితి.. ఉద్యోగ అవసరాలు.. సామాన్యులు కూడా విమానంలో ప్రయాణించడం ఇటీవల సర్వ సాధారణం అయిపొయింది. అయితే, విమానం ఎక్కడానికి ఎయిర్ పోర్ట్ కు కనీసం మూడు గంటల ముందు చేరుకోవాలి. అక్కడకు చేరుకున్నాకా చాయ్ తాగాలని అనిపించిందనుకోండి. కనీసం 100 రూపాయాలు ఖర్చు చేయాలి. ఇక టిఫిన్ లేదా స్నాక్స్ అయితే కనీసం 200 రూపాయలు లేకుండా ఏదీ దొరకదు. కానీ.. విమానాశ్రయాల్లో 10 రూపాయలకే టీ దొరికితే.. 20 రూపాయలకే సమోసా లేదా వడ లాంటి స్నాక్స్ అందుబాటులోకి వస్తే.. ఆ ఊహే భలేగా ఉంది కదూ. ఇప్పుడు చెన్నై విమానాశ్రయంలో ఇదే రేటుకు అన్నీ అందుబాటులో ఉన్నాయి.

Also Read: Union Government: రాష్ట్రాలకు పన్ను వాటా తగ్గించనున్న కేంద్రం!

కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఉడాన్ యాత్రి కేఫ్ ఇన్ చెన్నై ‘ అనే స్నాక్ షాపును ప్రారంభించారు . ఈ ‘ఉడాన్ యాత్రి కేఫ్’ టీ, కాఫీ మొదలైన వాటిని తక్కువ ధరలకు విక్రయిస్తుంది. అంటే, ప్రయాణీకులు టీ, కాఫీ, వడలు మొదలైన వాటిని రూ. 20 కి కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా, విమానాశ్రయ హోటళ్లలో ఆహార ధర చాలా రెట్లు ఎక్కువగా ఉంటాయి. విమానాశ్రయాలలో ఆహారం, పానీయాల అధిక ధరలు ప్రయాణికులకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి.విమానాశ్రయాలలో ఒక కప్పు టీ లేదా కాఫీ రూ.100 వరకు అమ్ముతారు. దోసె, ఇడ్లీలు రూ.200 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. దీనివల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Udaan Yatri Cafe: ప్రయాణికుల ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అదే ‘ఉడాన్ యాత్రి కేఫ్’. ఈ కేఫ్ ప్రస్తుతం చెన్నై విమానాశ్రయంలో తెరిచి ఉంది. మొదటి ఉడాన్ యాత్రి కేఫ్ డిసెంబర్ 2024లో కోల్‌కతా విమానాశ్రయంలో ప్రారంభించారు. ఈ కేఫ్ ప్రయాణికులలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని కారణంగా, దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో ఉడాన్ యాత్రి కేఫ్‌లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికప్లాన్ చేసింది.

ఇందులో భాగంగా ఉడాన్ యాత్రి కేఫ్ ఇప్పుడు చెన్నై విమానాశ్రయంలో ప్రారంభించారు. ఇక్కడ, బాటిల్ వాటర్ 10 రూపాయలకు, టీ 10 రూపాయలకు, కాఫీ 20 రూపాయలకు, సమోసాలు 20 రూపాయలకు, వడలు 20 రూపాయలకు అమ్ముతారు. దీని ద్వారా ప్రయాణికులు చెన్నై విమానాశ్రయంలో తక్కువ ధరకు ఆహారాన్ని కొనుగోలు చేయవచ్చు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *