SS Rajamouli:

SS Rajamouli: వివాదంలో టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి

SS Rajamouli: టాలీవుడ్ ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి ఓ వివాదంలో చిక్కుకున్నారు. రాజ‌మౌళి టార్చ‌ర్ భ‌రించ‌లేక‌పోతున్నాన‌ని, ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మంటూ ఆయ‌న స్నేహితుడైన యూ శ్రీనివాస్‌రావు మ‌ర‌ణ వాంగ్మూలంతోపాటు సెల్ఫీ వీడియోను విడుద‌ల చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఇదే నా మ‌ర‌ణ వాంగ్మూల‌మంటూ ఆయ‌న పేర్కొన్న ఆ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది.

SS Rajamouli: ఎస్ఎస్ రాజ‌మౌళితో త‌నకు 34 ఏండ్ల స్నేహ‌బంధం ఉన్న‌ద‌ని యూ శ్రీనివాస్‌రావు ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన య‌మ‌దొంగ సినిమాకు యూ శ్రీనివాస్‌రావు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. అయితే ఓ అమ్మాయి కార‌ణంగా త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ట్ర‌యాంగిల్ లవ్ స్టోరీతో విభేదాలు పొడ‌చూపాయ‌ని శ్రీనివాస్‌రావు చెప్పుకొచ్చారు.

SS Rajamouli: ఆ అమ్మాయిని ముందు రాజ‌మౌళి, ఆ త‌ర్వాత తాను ప్రేమించాన‌ని యూ శ్రీనివాస్‌రావు చెప్పారు. అయితే కెరియ‌ర్ ఆరంభ ద‌శ‌లో ఇలాంటి గొడ‌వలు వ‌ద్ద‌నుకొని, రాజ‌మౌళి కోరిక మేర‌కు తాను ఆ అమ్మాయిని త్యాగం చేశాన‌ని వివ‌రించారు. ఇన్నాళ్ల‌కు అత‌ను నంబ‌ర‌వ‌న్ డైరెక్ట‌ర్ అయ్యాక గ‌తంలోని విష‌యాలు ఎవ‌రికో చెప్పాన‌న్న అనుమానంతో త‌న‌ను వేధించ‌డం మొద‌లుపెట్టాడ‌ని చెప్పారు. దీంతోనే రాజ‌మౌళి టార్చ‌ర్‌ను త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని వీడియోలో, లేఖ‌లో శ్రీనివాస్‌రావు ఆరోపించారు.

SS Rajamouli: రాజ‌మౌళి గురించి యూ శ్రీనివాస్‌రావు మరికొన్ని వివాదాస్ప‌ద అంశాల‌నూ తెర‌మీదికి తేవ‌డం గ‌మ‌నార్హం. 54 ఏళ్ల వ‌య‌సులో తాను రాజ‌మౌళి వేధింపుల‌ను త‌ట్టుకోలేక‌పోతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. తాను ఇదంతా ప‌బ్లిసిటీ కోసం చేయ‌డం లేద‌ని చెప్పారు. తాను చెప్పిన విష‌యాల‌పై పోలీసులు వారిని లైడిటెక్ట‌ర్ టెస్టులు చేయాల‌ని కోరాడు. ఈ విష‌యంలో రాజ‌మౌళి స‌తీమ‌ణి ర‌మా రాజ‌మౌళి కూడా వేధిస్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన‌డం గ‌మనార్హం.

SS Rajamouli: ఎస్ఎస్ రాజ‌మౌళికి తాంత్రిక విద్య‌లు కూడా తెలుస‌న‌ని, త‌న‌కు పోటీగా ఉన్న డైరెక్ట‌ర్ల‌నంద‌రినీ అత‌ను తొక్కివేశాడంటూ బాంబు పేల్చాడు. ఇప్పుడు మ‌రికొంద‌రు డైరెక్ట‌ర్లను కూడా ల‌క్ష్యంగా చేసుకున్నాడ‌ని ఆరోపించారు. వీట‌న్నింటిపై నిజాలు తెలియాలంటూ అత‌డికి లైడిటెక్ట‌ర్ ప‌రీక్ష‌లు చేయాలని శ్రీనివాస్‌రావు కోరారు. తాను చెప్పిన ఆధారాల ఆధారంగా సుమోటోగా కేసు న‌మోదు చేయాల‌ని మెట్టు పోలీసుస్టేష‌న్ పోలీసుల‌కు విజ్ఞ‌ప్తి చేశాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ram Talluri: నవంబర్ రామ్ తాళ్లూరి దేనా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *