Srisailam Temple:శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసుకున్నది. మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన తండ్రీకొడుకులు నదిలో మునిగి చనిపోయారు. నీటిలో మునుగుతున్న కొడుకును కాపాడే ప్రయత్నంలో తండ్రి కూడా అదే నీటిలో మునిగి చనిపోయిన ఘటనతో అక్కడ విషాదం అలుముకున్నది. వారిది తూర్పు గోదావరి జిల్లాగా గుర్తించారు.
Srisailam Temple:శ్రీశైలం మల్లన్న దర్శనానికి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన భార్యాభర్తలు, కొడుకు కలిసి వచ్చారు. లింగాలగట్టు పెద్ద బ్రిడ్జి కింద పాతాళగంగలో కొడుకు స్నానమాచరిస్తూ నదిలోకి వెళ్లిపోయాడు. దానిని గమనించి తండ్రి అతడిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరూ నీట మునిగి మృ తి చెందారు.
