Telangana: ఓటుకు నోటు కేసు విచారణను నాంపల్లి ఈడీ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసుపై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారణకు హాజరవుతారని అందరూ భావించారు. అయితే ఈడీ కోర్టు న్యాయమూర్తి అందుబాటులో లేని కారణంగా నవంబర్ 14వ తేదీకి ఈ కేసు విచారణను వాయిదా వేశారు.
