Allu Arjun

Allu Arjun: మార్చి నుంచి బన్నీ, త్రివిక్రమ్ సినిమా స్టార్ట్..?

Allu Arjun: జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు. ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

Also Read: NTR 31: ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ తో రెండో షెడ్యూల్ !

ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు.ఐతే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా పై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే, ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ పాల్గొనడు అని.. రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాక.. జూన్ నుంచి బన్నీ షూట్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *