NTR 31: ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా పై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను రెడీ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆ సెట్ లోనే జరుగుతుంది. అయితే, ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో తారక్ లేని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. కాగా మార్చి మూడో వారం నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నాడు. ఎన్టీఆర్ పై మొదట యాక్షన్ సీన్స్ తో రెండో షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తారట.కాగా ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్ కనిపించబోతుంది. మలయాళ యువ హీరో టొవినో థామస్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
