Chiranjeevi: ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్. అయితే ఆల్ఫెడ్ హిచ్కాక్ 125వ జయంతి సందర్భంగా, అలానే ఆయన తొలి సినిమా విడుదలై వందేళ్లు అయిన సందర్భంగా ఆయన సినీ జీవితంపై ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్’ పేరుతో సీనియర్ జర్నలిస్ట్, సినీ రచయిత పులగం చిన్నారాయణ – ఐఆర్టిఎస్ అధికారి రవి పాడితో కలిసి పుస్తకం తీసుకొచ్చారు. డిసెంబర్ 18న ఫస్ట్ కాపీ విడుదలైంది.
Also Read: Akhanda 2: అఖండ 2 లో ఆది పినిశెట్టి కన్ఫర్మ్!
ఐదు రోజుల్లో పుస్తకాలన్నీ అమ్ముడు కావడంతో సరికొత్త చేర్పులతో సెకండ్ ఎడిషన్ లాంచ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్’ బుక్ సెకండ్ ఎడిషన్ లాంచ్ జరిగింది. ఈ బుక్ చూసిన మెగాస్టార్ ఆసక్తి కనబరిచారు. తాను పుస్తకం చదువుతానని తెలిపారు. తెలుగులో ఇటువంటి పుస్తకం తీసుకు రావడం అభినందనీయమని ప్రశంసించారు.
