Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy: వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటన

Kakani Govardhan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ వర్షాలు, వరదల సమయంలో ప్రజల వెన్నంటే ఉంటాం ప్రజలకు ఏ అవసరం వచ్చినా, స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి

👉 వెంకటాచలం మండలంలోని జగనన్న కాలనీలో నూతనంగా ఇళ్ల ప్లాట్లు కేటాయించి, ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారుల కుటుంబాలతో మాట్లాడి, క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి కాకాణి.

👉 జగనన్న ఇళ్లతో, తాము వరదల సమయంలో వలసలు వెళ్లే అవసరం లేకుండా, పిల్లలు, వృద్దులతో తాము నిర్మించుకున్న తమ సొంత ఇళ్లలోనే క్షేమంగా ఉన్నామంటూ సంతృప్తి వ్యక్తం చేసిన మహిళలు.

👉 నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సేవలు అందించడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు.

👉 అధికారం ఉన్నా, లేకపోయినా, పదవులు కోల్పోయినా ప్రజాసేవ విషయంలో మాత్రం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి, సహాయ సహకారాలు అందిస్తాం.

👉 సర్వేపల్లి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశాం.

👉 నెల్లూరు జిల్లాలో విపత్తు సమయంలో అధికారులు, అధికార పార్టీ నాయకులు పరిపాలనను గాలికి వదిలివేసి, మద్యం షాపుల కేటాయింపులో బిజీబిజీగా ఉండటం దౌర్భాగ్యం.

👉 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పేదలకు అత్యంత విలువైన స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో ఆ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి.

👉 వెంకటాచలం మండల కేంద్రంలో చిన్నపాటి వర్షాలకు ఇల్లు కురిసి, ఇళ్లలోకి నీళ్లు వచ్చి దుర్భరమైన జీవితం గడిపిన ఎస్టీ కుటుంబాలు, ఈరోజు సంతోషంగా జగనన్న కాలనీలో సొంత ఇళ్లు కట్టుకొని ఉండటం ఆత్మసంతృప్తి కలిగించే విషయం.

👉 భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిరంతరం సేవలు కొనసాగిస్తాం.

👉 జిల్లా ప్రజానీకానికి మరీ ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, వెంటనే స్పందించి, సకల చర్యలు చేపడుతాం.

👉 ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు, కందుకూరు నియోజకవర్గంతో సహా ఎటువంటి విపత్కర పరిస్థితి సంభవించినా, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, ఎటువంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.

ALSO READ  Chandrababu Naidu: బాబు భారీ ఎజండా.. ఢిల్లీ భేటీ క్లారిటీ.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *