కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలకు తేదీలను ప్రకటించింది. మహారాష్ట్రలో అక్టోబర్ 22న నోటిఫికేషన్, నవంబర్ 20న ఎన్నికలు, 23న ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ స్పష్టం చేసింది. సింగిల్ ఫేజ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.
జార్ఖండ్లలో రెండు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు. నవంబర్ 13న నోటిఫికేషన్, 20న ఎన్నికలు, 23న ఫలితాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ’జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని ఈ ఎన్నికలు కూడా సక్సెస్ చేస్తామని తెలిపారు.

