NTR New Movie: బ్లాక్ బస్టర్ కెజియఫ్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్.ఇక ఆ తర్వాత వచ్చిన సలార్‌ను కూడా టు పార్ట్స్‌గా ప్రకటించాడు. సలార్ పార్ట్ 1 బ్లాక్ బస్టర్ అవగా క్లైమాక్స్‌లో సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం అనౌన్స్ చేశారు. సలార్ 1 కన్నా భారీగా సలార్ 2 తెరకెక్కించే ప్లానింగ్‌లో ఉన్నాడు నీల్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను కూడా KGF లాగానే రెండు భాగాలుగా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. చెప్పాల్సిన కథ ఎక్కువగా ఉండడంతో పాటు సీక్వెల్ అనేది ప్రశాంత్ నీల్‌కు ఓ సెంటిమెంట్లా మారింది. ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్-నీల్ 2 రావడానికి చాలా సమయం పట్టనుంది. సలార్ 2 తర్వాతే ఈ సినిమా ఉండనుంది. అయితే ఎన్టీఆర్-నీల్ మొదటి భాగం 2026లో రావడం పక్కా. ఇప్పటికే 2026 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించా
