KTR: క్రిష్ణా నీళ్లు ఏపీ తన్నుకపోతుంది.. ప్రభుత్వం ఏం చేస్తుంది..

KTR: తెలంగాణకు రావాల్సిన కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యథేచ్ఛగా తరలిస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మౌనం పాటిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ఇప్పటికే 646 టీఎంసీలు వినియోగించుకున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు.

సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడు నెలలుగా రోజుకు 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నీటిని తరలిస్తున్నా, కాంగ్రెస్ సర్కార్ ఏ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. నదీ జలాలను ఏపీ తనకు అనుకూలంగా మళ్లించుకుంటున్నా, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబి) కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

కేటీఆర్ ఆరోపణల ప్రకారం, తెలంగాణ రైతులకు నీటి కోసం ఇబ్బంది పెడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీ ట్రిప్పుల్లో మునిగిపోయారని అన్నారు. గత పాలనలో కేసీఆర్ నదీ జలాలను కాపాడి పొలాలను సస్యశ్యామలం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఒకే ఏడాది లోనే రాష్ట్రాన్ని నీటి కొరతతో ఇబ్బందులు పడేలా చేసిందని మండిపడ్డారు.

“నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం కోసం ఏర్పడ్డ రాష్ట్రంలో, ఇప్పుడు అన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం గంగలో కలిపేస్తోంది,” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటిమట్టం తగ్గిపోవడం, రైతులు నీటి కోసం ఆందోళన చేయడం కాంగ్రెస్ సర్కార్‌ను ఎటువంటి ప్రభావితంచేయడం లేదని ఆరోపించారు.”జాగో రైతున్న జాగో… జాగో తెలంగాణ జాగో…” అంటూ రైతులకు, ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *