nani

Nani: శేఖర్ కమ్ములతో నాని సినిమా?

Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను డైరెక్షన్‌లో ‘హిట్-3’ సినిమా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా రెండు వైవిధ్యమైన నేపథ్యంలో రాబోతున్నాయి. ఇక ఇప్పుడు నాని మరో స్టార్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు శేఖర్ కమ్ముల. శేఖర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’ త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల నానితో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం.దీంతో నాని కోసం శేఖర్ కమ్ముల ఎలాంటి కథను రెడీ చేస్తాడా.. వీరిద్దరి కాంబినేషన్ ఎలాంటి హిట్ పడుతుంది అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరి నిజంగానే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రానుందా అనేది చూడాలి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *