Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ రోజు (ఫిబ్రవరి 11) తెలంగాణలో పర్యటించనున్నారు. హనుమకొండ నగరంలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటన విషయం అకస్మాత్తుగా డిసైడ్ అయిందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు నేరుగా చేరుకోనున్నారు. అక్కడి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హనుమకొండకు హెలికాప్టర్‌లో చేరుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండకు చేరుకున్న తర్వాత.. నగరంలోని హోటల్ సుప్రభలో అరగంటపాటు రెస్ట్ తీసుకుంటారు.
Rahul Gandhi: హనుమకొండలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో రాహుల్‌గాంధీ సమావేశం కానున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో హనుమకొండ నగరంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హనుమకొండ పర్యటన అనంతరం ఆయన రైలులో తమిళనాడుకు బయలుదేరి వెళ్తారు. రాత్రి 7.30 గంటలకు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి ఆయన తమిళనాడుకు రైలులో వెళ్తారు. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న విద్యార్థులతో కలిసి ఆయన ప్రయాణం చేస్తారు. ఈ సందర్భంగా రైలులోనే విద్యార్థులతో రాహుల్ ముఖాముఖి నిర్వహిస్తారు.

