Lumpy Skin Disease: పాడి జంతువులను ప్రభావితం చేసే లంపీ స్కిన్ డిసీజ్ కోసం భారత్ బయోటెక్ గ్రూప్ కంపెనీ బయోవెట్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) లైసెన్స్ ఇచ్చింది.
వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరల్ ఇన్ఫెక్షన్ నుండి పశువులను రక్షించే ప్రపంచంలోనే మొట్టమొదటి టీకా ఇదేనని కంపెనీ పేర్కొంది. జ్వరం, చర్మం వాపు, శోషరస కణుపులు విస్తరించడం ఈ వ్యాధి లక్షణాలు.
బయోవెట్ ఈ వ్యాక్సిన్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) సహకారంతో తయారు చేసింది. దీనికి బయోలంపివాక్సిన్ అని పేరు పెట్టారు ఈ వ్యాక్సిన్ త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది.
