Shraddha Kapoor: తారక్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న ‘వార్2’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేశారట మూవీ టీం. అది కూడా బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఆల్రెడీ ఎన్టీఆర్ ఇంట్రో సాంగ్, హృతిక్ సాంగ్ తో పాటు ఇద్దరి కాంబోలో ఒక మాస్ డాన్స్ నంబర్ కూడా ఉండబోతుందట. ఇక ఇప్పుడు వాళ్ళ కాంబోలో ఊర మాస్ ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేసినట్లు లేటెస్ట్ సమాచారం. అంతేకాదు ఈ స్పెషల్ సాంగ్‌ని బాలీవుడ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటెం సాంగ్స్ లో ఒకటిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందుకోసం టాప్ కొరియోగ్రాఫర్లు పని చేస్తున్నారట. శ్రద్దా కపూర్ తెలుగులో ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించి ఆకట్టుకుంది.
