Tamilnadu: తమిళనాడులోని కేవీ కుప్పం స్టేషన్ సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోయంబత్తూరు-తిరుపతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన గర్భిణి బాత్రూమ్కు వెళ్లిన సమయంలో హేమరాజ్ అనే వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
మహిళ ప్రతిఘటించగా, నిందితుడు ఆమెను రైలు నుంచి తోసివేశాడు. దీంతో ఆమె కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే తోటి ప్రయాణికులు ఆమెను కాపాడి, కాట్పాడి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హేమరాజ్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతనిపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన రైల్వే ప్రయాణికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు తలెత్తకుండా అధికారాలు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.