Shreyas Iyer: నాగ్పూర్ లో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ బౌలర్లకు ఒక మోత మోగించాడు టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. ఆరు నెలల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన అయ్యర్, అతని అద్భుతమైన హాఫ్ సెంచరీతో అందరినీ మెప్పించాడు. ముఖ్యంగా పవర్ ప్లే లో ఓపెనర్లు కోల్పోయిన సమయంలో జోఫ్రా ఆర్చర్ ఇప్పుడు జరిగే బంతులు సంధిస్తున్న నేపథ్యంలో మైదానంలోకి వచ్చిన అయ్యర్ ఎదురు దాడి చేయడం మొదలుపెట్టాడు ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డుని సాధించాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలోనే యశస్వి జైశ్వాల్ (15), రోహిత్ శర్మ(2) వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అయ్యర్, ఇంగ్లండ్ బౌలర్లను అతను వెనక్కి తీసాడు. శుబ్మాన్ గిల్తో కలిసి పరుగులు సాధించాడు. దీనిలో భాగంగా, అయ్యర్ 30 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లు, 2 సిక్స్లతో 59 పరుగులు సాధించి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ తన అద్భుతమైన ఇన్నింగ్స్తో ఓ అపూర్వ రికార్డును స్వంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి, 50 కంటే ఎక్కువ సగటు, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడు అయ్యర్.
ఇది కూడా చదవండి: Jonathan Campbell: డెబ్యూ మ్యాచ్ లోనే కెప్టెన్సీ..! వాట్ ఏ లక్కీ ఛాన్స్..!
ఇప్పటి వరకు ప్రపంచ క్రికెట్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి ఈ సాధనను ఎవరూ చేయలేదు. అయితే ఇతర స్థానాల్లో నుంచి వచ్చి ఈ రికార్డును పలువురు చేరుకున్నారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ క్వింటన్ డి కాక్ ఓపెనర్గా, శుబ్మాన్ గిల్(రెండో స్థానం), ఏబీ డి విలియర్స్(ఐదో స్థానం) ఈ ఘనతను సాధించారు.
ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహుమూద్, అదిల్ రషీద్ తలా రెండు వికెట్లు సాధించారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 52; 4 ఫోర్లు), జాకబ్ బెతెల్ (64 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలు చేయగా, ఫిల్ సాల్ట్ (26 బంతుల్లో 43; 5 ఫోర్లు, 3 సిక్స్లు), డకెట్(32) బాగా ఆడారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా తలా మూడు వికెట్లు పడగొట్టారు. రెండో వన్డే కటక్ వేదికగా ఫిబ్రవరి 9న జరగనుంది.

