America: అమెరికా దేశంలో ఇటీవలే వాషింగ్టన్, ఫిలడెల్ఫియాలో జరిగిన వరుస విమాన ప్రమాదాల్లో పలువురు మృతి ఘటనలను మరువక ముందే మరో విమానం అదృశ్యమైంది. పైలెట్ సహా ఆ విమానంలో మరో 9 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ మేరకు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. విమానం ఆచూకీ రాడార్ వ్యవస్థకు అందడం లేదని తెలిపారు. దాని జాడ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలస్కా మీదుగా ప్రయాణిస్తుండగా ఈ విమానం అదృశ్యం అయిందని తెలిపారు.
America: అమెరికాలో శుక్రవారం (ఫిబ్రవరి 7) నాడు బెరింగ్ ఎయిర్ ఫ్లైట్ 445, సెస్నా 208బి గ్రాండ్ కారవాన్ విమానం అలస్కా మీదుగా ఉనాలక్ లీట్ నుంచి నోమ్‌కు వెళ్తుండగా ఆచూకీ లభించడం లేదు. వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల కారణంగానే విమానం అదృశ్యం అయినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. రెండు విమాన ప్రమాదాలు జరిగిన వారంరోజుల లోపునే మరో విమానం అదృశ్య కావడంపై ఆ దేశంలో ఆందోళన నెలకొన్నది.
America: వారం క్రితం అమెరికా వాషింగ్టన్ డీసీలోని ఓ ఎయిర్ పోర్ట్‌లో విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 60 మంది చనిపోయారు. మరో ప్రమాదంలో ఫిలడెల్ఫియాలోని షాపింగ్‌మాల్ వద్ద ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.