Sexually Assaulted: విద్యార్థినిపై ఓ టీచర్ లైంగిక దాడికి పాల్పడ్డ దారుణ ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది. బాలిక తల్లిదండ్రు ఆ కీచక టీచర్ కు దేహశుద్ది చేశారు. స్కూల్లో పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ ఉపాద్యాయుడు కీచకుడుగా మరాడు. అదే స్కూల్లో చదువుతున్న ఓ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. అనకాపల్లి, వడ్డాది ఎన్‌టీఎస్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో ఉపాధ్యాయుడుగా ఉన్న ప్రసాద్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ దారుణాన్ని ఆ బాలిక ఇంటికి వెళ్లి, తల్లిదండ్రులతో చెప్పుకున్నది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రు పాఠశాలకు వెళ్లారు. ఆ టీచర్ ను నిలదీయడంతో.. తనకేమి తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిని ఈడ్చుకెళ్లి, స్తంబానికి కట్టేసి చితకొట్టారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: కిచక టీచర్స్.. 13 ఏళ్ల విద్యార్ధి పై అత్యాచారం..
పాప తమతో అంతా చెప్పిందని, ఇప్పటికైనా చేసిన నేరం ఒప్పకోవాలని దేహశుద్ది చేశారు. ఈ ఘటనతో స్కూల్లో విద్యార్థినిల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కీచక ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.