Rishabh Pant

Rishabh Pant: తన ఆదాయంలో ఆ మొత్తం ఫౌండేషన్ కే..! పంత్ సంచలన ప్రకటన

Rishabh Pant: భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ తన వాణిజ్య ఆదాయంలో పది శాతాన్ని రిషబ్ పంత్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా కీలక సభ్యుడిగా నిలిచిన ఈ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్, రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు ముఖ్య పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. క్రికెట్‌తో పాటు సమాజ సేవలో కూడా తన తరఫున స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను అని చెప్పిన పంత్, ఇంకా ఏమేమి విషయాలను పాలుపంచుకున్నాడో చూద్దాం..!

తల వాణిజ్యాదాయంలో 10 శాతాన్ని ఫౌండేషన్ కు విరాళంగా ఇస్తున్నట్లు చేసిన ప్రకటనలో భాగంగా రిషబ్ పంత్ ఇలా మాట్లాడాడు.., “క్రికెట్ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ క్రీడ నాకు ఇచ్చిన అన్నింటికీ ధన్యవాదాలు తెలియజేసేందుకు, సమాజానికి నా వంతు సహాయం అందించాలనుకుంటున్నాను. అందుకే, నా వాణిజ్య ఆదాయంలో పది శాతాన్ని రిషబ్ పంత్ ఫౌండేషన్‌కు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. ఇది చాలా సంతోషకరమైన విషయం, త్వరలోనే నా ప్రణాళికల గురించి మరియు కార్యాచరణ గురించి మరిన్ని వివరాలు పంచుకుంటాను” అని తెలిపాడు.

ఇటీవల జరిగిన IPL మెగా వేలంలో రిషబ్ పంత్ రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతని కోసం ఏకంగా రూ. 27 కోట్లు వెచ్చించి, అతడిని తమ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా నియమించింది. అంతకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించిన అనుభవం ఉన్న రిషబ్, టీ20 ఫార్మాట్‌లో భారత జట్టును నడిపించిన అనుభవం కూడా ఉంది. లీడర్ గా కూడా పంత్ కి మంచి మార్కులే పడ్డాయి.

ఇది కూడా చదవండి: Dollar Dreams: అప్పులు.. ఆస్తుల అమ్మకాలతో డాంకి రూటులో అమెరికాకి.. చివరికి అవమానకరంగా ఇంటికి..

2017లో భారత జట్టులో అరంగేట్రం చేసిన రిషబ్ పంత్, వన్డేలు, టెస్టులు, టీ20లు అన్నిటిలోనూ అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇప్పటివరకు 150 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అతడు, గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు..

అయితే ఎంత దూకుడుగా ఆడే ఈ బ్యాటర్… ఎవరూ ఊహించని విధంగా టెస్టు క్రికెట్‌లో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల్లో వికెట్ కీపర్‌గా సెంచరీలు చేసిన ఏకైక భారత క్రికెటర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఇలాక్రికెట్‌లో రికార్డులను సృష్టిస్తున్న రిషబ్, ఇప్పుడు రిషబ్ పంత్ ఫౌండేషన్ ద్వారా సమాజ సేవలో కూడా తన ముద్ర వేయాలని నిర్ణయించుకున్నాడు.

త్వరలో రెండు నెలల్లో ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు ప్రకటించనున్నాడు. ఆటతో పాటు సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న రిషబ్, క్రీడా ప్రపంచంలో మాత్రమే కాకుండా సమాజంలో కూడా ప్రేరణగా నిలుస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *