Brahma Anandam: బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాతా మనవళ్ళుగా నటిస్తున్న సినిమా ‘బ్రహ్మా ఆనందం’. గతంలో ‘మళ్ళీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో ఆర్.వి.ఎస్. నిఖిల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, ‘వెన్నెల’ కిశోర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమా పంపిణీ హక్కుల్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి సొంతం చేసుకున్నారు. ‘పొలిమేర -2’ నుండి మొన్నటి ‘క’ చిత్రం వరకూ వంశీ నందిపాటి ఏ సినిమాను పంపిణీ చేసినా… అది చక్కని విజయాన్ని అందుకుంటూనే వస్తోంది. ‘బ్రహ్మా ఆనందం’ విషయంలోనూ అదే రిపీట్ అవుతుందనే ధీమాను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.
