Karathey Babu: ఇటీవల వైవాహిక జీవితంలోని ఒడిదుడుకుల కారణంగా వార్తల్లో నిలిచిన ‘జయం’ రవి తిరిగి నటనపై దృష్టి పెట్టాడు. అతని తాజా చిత్రానికి సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పొలిటికల్ డ్రామాకు ‘కరాటే బాబు’ అనే పేరు ఖరారు చేశారు. దీనికి సంబంధించిన టీజర్ నూ విడుదల చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలతో మాటల యుద్థం చేసే ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా రవి ఇందులో కనిపించారు. ఇందులో అతన్ని ప్రజలు అభిమానంతో ‘కరాటే బాబు’ అని పిలుస్తుంటారు. ఈ సినిమాలో ప్రతి పేరుకూ ఓ చరిత్ర ఉంటుందని దర్శకుడు ‘దాదా’ ఫేమ్ గణేశ్ చెప్పారు. ఈ సినిమాలో నాజర్, వీటీవీ గణేశ్, కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

