Movie Updates:

Movie Updates: జనవరి 30న విష్ణు వర్థన్ ‘ప్రేమిస్తావా?’

Movie Updates: ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణువర్థన్ గతంలో పవన్ కళ్యాణ్‌ హీరోగా ‘పంజా’ చిత్రాన్ని తెరకెక్కించాడు. అలానే ‘షేర్షా’ మూవీతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. అతని తాజా చిత్రం ‘నెసిప్పయా’ పొంగల్ కానుకగా జనవరి 14న తమిళనాట విడుదలైంది. ఈ ప్రేమకథా చిత్రాన్ని ‘ప్రేమిస్తావా’ పేరుతో తెలుగులో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ జనవరి 30న జనం ముందుకు తీసుకురాబోతోంది. ఈ సందర్బంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర బృందం పాల్గొంది. ఈ సినిమాలో ఆకాశ్ మురళీ హీరోగా నటించగా, ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి హీరోయిన్ గా చేసింది. త్వరలో విడుదల కాబోతున్న ‘భైవరం’ మూవీతో అదితి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. గతంలో ‘గని, మహావీరుడు’ చిత్రాలలో అదితి పాటలు పాడింది. తమిళంలో మాదిరి ఈ సినిమాకు తెలుగులోనూ చక్కని ఆదరణ లభిస్తుందనే ఆశాభావాన్ని దర్శకుడు విష్ణువర్థన్ వ్యక్తం చేశాడు.

ప్రేమిస్తావా మూవీ ట్రైలర్:

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  SV Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి 43వ చిత్రం వేదవ్యాస్ గ్రాండ్ ఓపెనింగ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *