Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ‘టాక్సీవాలా’. ఈ సినిమా చక్కని విజయాన్ని సాధించింది. అలానే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పటికే విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్, ఖుషీ’ చిత్రాలను నిర్మించింది. ఈ రెండు సినిమాలు ఘన విజయాలను సాధించకపోయినా మ్యూజికల్ గా చక్కని గుర్తింపును తెచ్చుకున్నాయి. ఇందులోని నటీనటులు సినిమాకు లభించిన స్పందన పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. తాజాగా వీరి కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ 14వ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసిన టీమ్ రిపబ్లిక్ డే న సినిమా సెట్ వర్క్ ను ప్రారంభించింది. బ్రిటీష్ కాలం నేపథ్యంలో వచ్చిన చిత్రాలలో ఇప్పటి వరకూ ఎవరూ తెరకెక్కించని కథాంశంతో ఇదో పవర్ ఫుల్ మూవీగా రూపుదిద్దుకోబోతోందని రాహుల్ సంకృత్యన్ తెలిపారు. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుండి 1878 వరకూ మధ్య జరిగిన కొన్ని యాదార్థ చారిత్రక సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అన్నారు.
