Aghathiyaa

Aghathiyaa: విడుదలైన ‘అగాధియా’ మూడో గీతం!

Aghathiyaa: జీవా, అర్జున్ సర్జా, రాశీఖన్నా కీలక పాత్రలు పోషించిన అఘాధియా ఫాంటసీ హారర్ థిల్లర్ గా తెరకెక్కుతోంది. పా. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుండి మూడవ గీతం విడుదలైంది. ఈ పాట గురించి దర్శకుడు పా. విజయ్ మాట్లాడుతూ, ‘నేలమ్మ తల్లే’ అనే ఈ పాట భూమి వారసత్వంలోకి ఓ ఆత్మీయ ప్రయాణం లాంటిది. ఇందులో వనమూలికలు, సహజ వనరులను ఉపయోగించి, లెక్కలేనన్ని వ్యాధులను నయం చేసే గుణాలు ఉన్నాయని చెప్పబోతున్నాం. దీనికి దీపక్ కుమార్ పాధి చక్కని విజువల్స్ అందించారు’’ అని తెలిపారు. ఈ పాట మన నేల శక్తి ద్వారా మానవాళికి దోహదపడిన ఋషులు, వైద్యులకు తామిస్తున్న నివాళి అని పా. విజయ్ చెప్పారు. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా నిర్మించిన ‘అఘతియా’ మూవీ ఫిబ్రవరి 28న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *