sandhya theatre: ‘పుష్ప-2’ సినిమాతో కొన్నివారాల పాటు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వార్తల్లో నిలిచింది. ‘పుష్ప -2’ సినిమా ప్రీమియర్ షోకు హాజరుకావడానికి అల్లు అర్జున్ కు పర్మిషన్ ఇచ్చారని కొందరు, ఇవ్వలేదని కొందరు వాదించుకున్నారు. ఓ మహిళ మృతికి కారణమైన సంధ్య థియేటర్ ను శాశ్వతంగా మూసివేస్తారనే వదంతులూ వచ్చాయి. వాటి మాట ఎలా ఉన్నా… ఇప్పుడు మాత్రం ‘పుష్ప-2’ మూవీ కారణంగా సంధ్య ధియేటర్ ఓ రేర్ రికార్డ్ ను సృష్టించిందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ప్రకటించారు. 51 రోజుల్లో ఈ థియేటర్ లో 206 ఆటలను ప్రదర్శించగా, ఒక లక్ష నాలుగు వేల ఐదువందల ఎనభై మంది సినిమాను చూశారని, రూ. ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల, ఎనిమిది వందల ఎనబై రూపాయల గ్రాస్ వసూలు అయ్యిందని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని సింగిల్స్ థియేటర్స్ కలెక్షన్ కు సంబంధించి ఇది రేర్ రికార్డ్ అని వారు పేర్కొన్నారు. మొత్తానికి వివాదాలతోనే కాదు… రికార్డులతోనూ సంధ్య థియేటర్ వార్తలలో నిలిచింది.
