Gukesh

Gukesh: అద్భుతమైన డ్రాతో బయటపడ్డ ప్రపంచ ఛాంపియన్ గుకేష్..!

Gukesh: ఎంతో రసవత్తరంగా జరుగుతున్న టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ లో భారత ఆటగాళ్ల నుంచి మిశ్రమ ఫలితాలు వస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని డ్రా లు విజయం కంటే తీయగా ఉంటాయి అని నానుడి చెస్ లో చాలాసార్లు వినిపిస్తుంది. కచ్చితంగా ఓడిపోయే స్థాయి నుండి ప్రత్యర్థితో సమానంగా డ్రా చేసుకోవడం కూడా అప్పుడప్పుడు ఒక పెద్ద విజయంగా పరిగణించబడుతుంది. అలాంటి ఒక అద్భుతమైన డ్రా ను ప్రపంచ ఛాంపియన్… యువ గుకేష్ సాధించాడు.

ఉజ్బెకిస్తాన్ కు చెందిన గ్రాండ్ మాస్టర్ అబ్దుసత్తోరోవ్ తో నిన్న జరిగిన టాటా స్టీల్ చెస్ చాంపియన్ షిప్ రౌండ్ గేమ్ లో గుఖేష్ డ్రా తో బయటపడ్డాడు. నల్లపావులతో ఆట ప్రారంభించిన ముకేష్ దాదాపు 6 గంటల పాటు పోరాడి ఓడిపోయే స్థితి నుండి ప్రత్యర్థి డ్రా తో సరిపెట్టుకునే స్థాయి వరకు వచ్చి ఒక పాయింట్ సాధించాడు.

మొదటి నుండి ఆటలో తడబడుతున్న గుకేష్ తో 20వ ఎత్తుకు ముందే అబ్దుసత్తోరోవ్ ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. బోర్డ్‌లోని అత్యంత శక్తివంతమైన పావు అయిన గుకష్ కి చెందిన మంత్రి… తనను తాను రక్షించుకోవడానికే బోర్డు అంతా తిరిగే స్థితికి చేరుకుంది.

భారత గ్రాండ్ మాస్టర్ కు ఎటువంటి ఉపశమనం ఇవ్వకుండా 26వ కదలిక ద్వారా, అబ్దుసటోరోవ్ మరింత ముందంజ వేశాడు. 42వ కదలిక ద్వారా, ఉజ్బెక్ గ్రాండ్ మాస్టర్ ఒక బంటును కదిలించగా గుకేశ్ తన రాజును కదిలించడంలో 45వ కదలికలో పొరపాటు చేశాడు. వెంటనే 46వ కదలికలో పుంజుకున్న అబ్దుసట్టోరోవ్ బోర్డులో మరో రెండు బంటులను కలిగి ఉన్నాడు. నాలుగు కదలికల తర్వాత, గుకేష్‌కు బోర్డులో మూడు తక్కువ బంటులు ఉన్నాయి, కానీ అతని వద్ద ఒక అదనపు గుర్రం ఉండడంతో గేమ్ పట్ల కొద్దిగా సానుకూలతో ఉన్నాడు.

అక్కడి నుండి మళ్ళీ పుంజుకున్న గుకేష్… ప్రత్యర్థి అబ్దుసత్తోరోవ్ 52వ కదలికలో చేసిన తప్పిదంతో మళ్లీ మెరుగైన ఆట ప్రదర్శించాడు. ఆ తర్వాత 66 కదలికలలో ఇద్దరు ఆటగాళ్లు మూడుసార్లు జరిపిన గడులలోనికి పావులను జరపడంతో చివరికి మ్యాచ్ డ్రా గా ముగిసింది.

మ్యాచ్ తరువాత గుకేష్ మాట్లాడుతూ… తాను గేమ్ అంతా ఒత్తిడిలో ఉన్నానని… ఓపెనింగ్‌లో తప్పుగా ఆడానని చెప్పాడు. తాను చాలా వరకు పోరాడినట్లు అందుకే చివరికి డ్రా సాధించానని చెప్పిన గుకేష్… ఆటలో ఎప్పుడూ క్లిష్టపరిస్థితుల నుండి బయటపడేందుకు కొన్ని ఉపాయాలు, మార్గాలు ఉంటాయని చెప్పాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *