Pushpa 3: అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో ఇండియాలోనే అత్యధిక వసూళ్ళను సాధించిన చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్, దేవి మ్యూజిక్ తో పాటు ‘పుష్ప1, పుష్ప2’లోని ఐటమ్ సాంగ్స్ కూడా ఎంతో ప్లస్ అయ్యాయి. తొలి భాగంలో సమంత, రెండో భాగంలో శ్రీలీల ఈ ఐటమ్స్ లో నటించి వాటికి మరింత క్రేజ్ తెచ్చారు. ఇదిలా ఉంటే ‘పుష్ప3: ది ర్యాంపేజ్’ లో ఐటమ్ సాంగ్ జాన్వీ కపూర్ చేస్తే బాగుంటుంది అని అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఓ ఇంటర్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సమంత, శ్రీలీల వంటి నాయికలు నటించటం ఓ ప్రత్యేక గుర్తింపు కారణమైంది. ఇక జాన్వీ కపూర్ మంచి డాన్సర్ మాత్రమే కాదు. ఆమెలో శ్రీదేవి గ్రేస్ కనపిస్తుంది. అందుకే తనైతే బాగుంటుందని అన్నాడు. ఇక ఇతర సినిమాల్లో తను కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్స్ లో కాజల్, పూజా హేగ్డే వంటి స్టార్స్ చేయటం కూడా ప్లస్ అయిన విషయాన్ని గుర్తు చేశాడు. మరి ‘పుష్ప3’కి సంబంధించి ప్రకటన ఎప్పుడు వస్తుందో చూద్దాం.
