Mahaa Vamsi Comment: ఒళ్లుదగ్గర పెట్టుకోండి! ఎమ్మెల్సీ దువ్వాడ..మాధురిలకు మహావంశీ స్ట్రాంగ్ వార్నింగ్!

Mahaa Vamsi Comment: అందరికీ శకునం చెప్పే బల్లి తాను పోయి కుడితిలో పడ్డట్టు అని ఓ సామెత ఉంది. ఆలా ఉంది మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భాగోతం. పార్టీ. రాజకీయాల కలరింగ్ తో.. అందరినీ నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ.. హిందుత్వం గురించి.. ధర్మం గురించి.. నీతులు వల్లిస్తూ చట్టసభలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న శ్రీనివాస్ ఇప్పుడు చేస్తున్న దరిద్రం ఆ సామెతలనే ఉంది. భార్యా, పిల్లలను వీధిలో నిలబెట్టి. మాధురి అనే ప్రియురాలిని ఇంటిలో ఉంచుకుని.. వీరంగం చేసి బజారుకెక్కిన దువ్వాడ శ్రీనివాస్.. ఇప్పుడు ఆ వార్త ప్రసారం చేసినందుకు మహా వంశీ అంటే నామీద.. మీడియా మీద చిందులు తొక్కుతున్నారు. 

Mahaa Vamsi Comment: పరమ పవిత్రమైన తిరుమల మాడ వీధుల్లో ఎమ్మెల్సీ గా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి.. మాధురి అనే ఆమెతో ఫోటో షూట్ నిర్వహించారు. ఆ మాధురి మీడియాతో మాట్లాడుతూ”మేమిద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నాం. ఆయనకి, మాకు విడాకులు అయిపోయాకా పెళ్లి చేసుకుంటాం. అంతవరకూ ఇలానే కలిసి తిరుగుతాం” అంటూ మాట్లాడారు. అసలు తిరుమలపై వ్యక్తిగత విషయాలు మాట్లాడటమే తప్పు. పైగా తిరుమల మాడవీధుల్లో ఫోటో షూట్ చేయడం మరో తప్పు.  అన్నిటినీ మించి పరమ పవిత్రమైం శ్రీవారి పుష్కరిణి దగ్గర వీడియోలు తీసుకోవడం ఇంకో మహాపరాధం. ఇన్ని తప్పులు చేసి మీడియా మీద నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 

Mahaa Vamsi Comment: మీడియా తప్పుల్ని కచ్చితంగా వేలెత్తి చూపిస్తుంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న మీ ఇద్దరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వైసీపీలో ఉన్నామని తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెబుతున్నారు.. మీడియా తప్పుగా చెబుతోంది అంటున్నారు కదా.. ఒక ఛాలెంజ్.. ఏడుకొండల వాడి పాదాల చెంత తిరుమలలో బహిరంగ డిబేట్ పెట్టుకుందాం. అక్కడ ప్రజలు ఎవరిది తప్పు అంటారో తేల్చుకుందాం. 

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. మిమ్మల్ని ఎన్నడూ మేం తూలనాడలేదు. మీరు మీ ఇష్టానికి మాట్లాడితే క్షమించేది లేదు. తిరుమలలో మీరు చేసిన తప్పులకు టీటీడీ కేసు పెట్టింది. ముందు దాని సంగతి చూసుకోండి. 

Mahaa Vamsi Comment: మాటకు ముందు వైసీపీ, మాటకు వెనుక వైసీపీ అంటున్నారు. నేను ప్రశ్నిస్తున్నా.. జగన్ మోహన్ రెడ్డి గారిని.. లడ్డూ వ్యవహారంలో మాదేం తప్పులేదు అంటూ మీరు, మీ పార్టీ నాయకులూ చెప్పారు. తిరుమల పవిత్రత విషయంలో మీమీద కావాలని బురదజల్లుతున్నారని చెప్పారు. ఇప్పుడు మీ పార్టీకి చెందిన ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ చేసిన పనిని.. మాట్లాడుతున్న మాటలని ఖండించండి. వారిపై చర్యలు తీసుకోండి. లేదా ఇది మాకు సంబంధం లేని వ్యవహారం అని చెప్పండి. తప్పు చేసే నాయకులను శిక్షించి మీ పరువు నిలబెట్టుకోండి. 

Mahaa Vamsi Comment: దువ్వాడ శ్రీనివాస్ లాంటి వారి వ్యవహారాల్లో ప్రజలు కూడా కచ్చితంగా ఆలోచించాలి. ఇలాంటి వారు చేస్తున్న పనులను నిలదీయాలి. ప్రభుత్వానిదే కాదు.. ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి. అసలు మొదటి నుంచి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇలానే ఉంది. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ పబ్లిక్ గా తన ప్రత్యర్థుల్ని.. అవతల పార్టీ నాయకులను తూలనాడుతూ వస్తున్నారు. దీనిని అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. 

మళ్ళీ దువ్వాడకు ఛాలెంజ్ చేస్తున్నాను.. ప్లేస్ నువ్వు డిసైడ్ చేసినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎంతమందిని తెచ్చుకోవాలనేది నీ ఇష్టం. మీడియా వస్తుంది. ప్రజలు వస్తారు. డిబేట్ చేద్దాం. మీ తప్పులేదని అక్కడ నిరూపించుకోండి. 

మరిన్ని మహా వంశీ కామెంట్స్ కోసం ఇక్కడ చూడండి 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *