Varun Tej: జనవరి 19 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతని 15వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. గత కొన్నేళ్ళుగా సక్సెస్ లేక సతమతమౌతున్న వరుణ్ తేజ్ ఇప్పుడు రూట్ మార్చాడు. హ్యుమరస్ అండ్ అడ్వంచరస్ మూవీ ఒకటి చేయబోతున్నాడు. ఈ సినిమాను అతనితో ‘కంచె’ చిత్రం నిర్మించిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి యువీ క్రియేషన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతోంది. మేర్లపాక గాంధీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు. ఈ ఇండో-కొరియన్ హారర్ కామెడీ మూవీలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ యూనిక్ గా ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. వరుణ్ తేజ్ సైతం ‘కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా’ అంటూ హామీ ఇస్తున్నాడు. మరి ఈ చిత్రమైనా వరుణ్ తేజ్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.
тнє нαυηтιηg ιѕ αвσυт тσ тυяη нιℓαяισυѕ
& the Epic Entertainment Awaits ❤️🔥Wishing a very happy birthday to the ever versatile Mega Prince @IAmVarunTej ❤️
Let’s spell something sensational with #VT15 ~ AN INDO-KOREAN HORROR COMEDY💥
Directed by @GandhiMerlapaka
A @MusicThaman… pic.twitter.com/B4DJxWZuRz— UV Creations (@UV_Creations) January 19, 2025
