Suriya

Suriya: సూర్య, వెట్రిమారన్ ‘వాడివాసల్’ ఆగిపోలేదు!

Suriya: ఐదేళ్ళ క్రితం ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను… సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడివాసల్’ మూవీని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన వార్తలు ఒకటి రెండు సార్లు మీడియాలో వచ్చాయి కానీ ఈ మధ్య కాలంలో ఆ సినిమా ఊసే లేదు. దాంతో ఈ సినిమాను పక్కన పెట్టేశారనే పుకార్లూ బాగానే షికారు చేశాయి. తాజాగా కలైపులి ఎస్ థాను తన దర్శకుడు వెట్రిమారన్ తో కలిసి సూర్యను కలిసి పొంగల్ సందర్భంగా బొకేను ఇచ్చిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ సినిమా ఆగిపోలేదనే భావన సూర్య అభిమానులలో కలిగింది. 1940లో సి. ఎస్. చెల్లప్ప జల్లికట్టు నేపథ్యంలో నవలను రాశారు. తమిళ మోడ్రన్ లిటరేచర్ లో ఈ సంప్రదాయ క్రీడ నవల కారణంగానే పాపులర్ అయ్యింది. ఈ నవల ఆధారంగానే వెట్రిమారన్ ‘వాడివాసల్’ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. ఇటీవలే వెట్రిమాన్ తెరకెక్కించిన ‘విడుదల -2’ విడుదలై చక్కని విజయాన్ని అందుకుంది.

A photo of Vetri Maaran, Thanu and Suriya

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *