Reloaded version of Pushpa 2: ‘పుష్ప’ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్న పుష్పరాజ్… ఇప్పుడు ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పాడు. దానికి తగ్గట్టుగానే 1800 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి… 2024లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. అయితే… సంక్రాంతికీ తగ్గేదే లే అంటున్నాడు పుష్పరాజ్. ఈ సినిమాకు సంబంధించిన 20 నిమిషాల సన్నివేశాలను జత చేసి… జనవరి 11న థియేటర్లలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. మొత్తానికీ మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వాయిదా పడటంతో సంక్రాంతికి తమ చిత్రం ఏదో ఒకదాన్ని బరిలో దించాలని ఫిక్స్ అయిపోయినట్టుగా ఉంది… అందుకే ‘పుష్ప-2’ రీలోడెడ్ వర్షన్ ను రిలీజ్ చేస్తున్నారు.
