Goodachari 2: అడివి శేష్ ‘డెకాయిట్’ మూవీ నుండి శ్రుతి హాసన్ వైదొలగి, ఆమె స్థానంలోకి మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది. అనుకున్న సమయంలో షెడ్యూల్స్ జరక్కపోవడమే దీనికి కారణం అనే మాటలు వినిపించాయి. ఇప్పుడు అడివి శేష్ మరో సినిమా ‘జీ2’లో కూడా బనితా సంధు ను హీరోయిన్ గా తొలుత అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె స్థానంలోకి వామికా గబ్బిని తీసుకున్నారు. ఇటీవల అడివి శేష్‌తో యూరోపియన్ షూటింగ్ షెడ్యూల్‌ను వామికా ముగించింది కూడా. గతంలో తెలుగులో ‘భలే మంచి రోజు’లో వామికా నటించింది. డిసెంబర్ 25న విడుదలైన హిందీ సినిమా ‘బేబీ జాన్’లోనూ ఆమె కీలక పాత్రను పోషించింది. ఈ నెలలోనే ‘గూఢచారి -2’ గ్లిమ్స్ ను విడుదల చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. ‘గూఢచారి’ మూవీకి సీక్వెల్ అయిన ఈ చిత్రాన్ని వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ హై-ఆక్టేన్ స్పై థ్రిల్లర్ లో ఇతర ప్రధాన పాత్రలను ఇమ్రాన్ హష్మీ, మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు షాలిని పోషిస్తున్నారు.
