KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఫార్ములా ఇ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరుపక్షాల వాదనలు ముగించిన హైకోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. మరోవైపు హైకోర్టు తీర్పుపై కేటీఆర్ తన లాయర్లతో చర్చిస్తున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.