KTR: ఈ రేస్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు నేపథ్యంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలో ఉన్న ఓరియన్ విల్లాస్ లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
గత నెల 2వ తేదీన ఏసీబీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ నోటీసుల ప్రకారం, కేటీఆర్ ఇవాళ విచారణ కోసం ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. అయితే, అక్కడ తన న్యాయవాదితో కలిసి విచారణకు వెళ్లినప్పటికీ, పోలీసుల అనుమతి లేకపోవడంతో, తన వివరణతో కూడిన లేఖను అధికారులకు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో, తన నివాసంలో ఏసీబీ సోదాలు జరుగుతాయని కేటీఆర్ ఇప్పటికే ఉదయమే మీడియాకు వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే సాయంత్రానికి సోదాలు ప్రారంభమవడంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.