Deepika Padukone: నాజూకు షోకులతో నవయువకుల నరాలు జివ్వున లాగేస్తూ నంబర్ వన్ నాయిక అనిపించుకుంది దీపికా పదుకొణే. దక్షిణాదిన కన్ను తెరచిన దీపిక బాలీవుడ్ లో భమ్ చిక భమ్ ఆడేస్తోంది. షారుఖ్ ఖాన్ ‘ఓం శాంతి ఓం’తో ఉత్తరాది వారిని పలకరించిన ఈ దక్షిణాది ముద్దుగుమ్మ అక్కడే సెటిల్ అయిపోయింది. ఉత్తరాదికి చెందిన రణవీర్ సింగ్ ను పెళ్ళాడింది. ఓ బిడ్డకు తల్లయింది. షారుఖ్ ఖాన్ కు లక్కీ గాళ్ గా పేరు సంపాదించిన దీపికా పదుకొణే ‘పఠాన్, జవాన్’తో హీరోగారికి బిగ్ హిట్స్ అందించింది.. దీపికా పదుకొణే తెలుగులో జయంత్ రూపొందించిన ‘లవ్ 4 ఎవర్’లో స్సెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. కానీ, ఆ చిత్రం ఈ నాటికీ వెలుగు చూడలేదు. గత సంవత్సరం ‘కల్కి’తోనే తెలుగు సినిమాలో తళుక్కుమన్న దీపిక అందులో అందాలతో బంధం వేయలేకపోయింది. అయినా నటిగా మంచి మార్కులే పోగేసింది. జనవరి 5న దీపికా పదుకొణే బర్త్ డే… రాబోయే రోజుల్లోనూ దీపికా తన అందంతో మాయ చేస్తుందేమో చూడాలి.
