Sajjala Ramakrishna Reddy: గత ప్రభుత్వం హయాంలో లో కబ్జాలకు కాదేది అనర్హం..అన్న విధంగా చేసి చూపించారు గత ప్రభుత్వ సకల శాఖా మంత్రి సజ్జల రామక్రిష్ణారెడ్డి..కడప పట్టణానికి అతి సమీపంలో వందల ఎకరాల రాజర్వ్ ఫారెస్ట్ భూమికే ఎసరు పెట్టారు..అధికారం చేతిలో ఉండడంతో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు కన్నెత్తి చూడలేదు..వెరవి ఫారెస్ట్ లో తన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు..కడప గడప సజ్జల ఫారెస్ట్ భూముల అక్రమాలపై మహా టివి ఎక్స్ క్లూసివ్ రిపోర్ట్…
సకల శాఖా మంత్రిగా,సిఎం తర్వాత షాడో సిఎం గా గత ఐదేళ్లుగా సజ్జల నడిపిన అవినీతి సామ్రాజ్యం కోటకు కూటమి ప్రభుత్వం బీటలు వచ్చేలా చేస్తొంది.అసలే సిఎం తర్వాత సిఎం ఇక ఆయనకు అడ్డు ఏముంటుంది.పైగా సొంత జిల్లా ఇక ఆపేదెవరు అనుకున్నారో ఏమో ఏకంగా రిజర్వ్ ఫారెస్ట్ భూములకు ఎసరు పెట్టారు సజ్జల రామక్రిష్ణారెడ్డి.కడప నగర శివార్లలో చింతకొమ్మదిన్నె మండలం పరిధిలో దివాకర్ ఎస్టేట్ పేరుతో ఫారెస్ట్ భూములను ఆక్రమించారు సజ్జల సోదరులు.భూమి తన తమ్ముళ్ళు దివాకర్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి పేరు మీద ఉన్నప్పటికి సజ్జల రామక్రిష్ణారెడ్డివే భూములు అంటున్నారు.కడప చిత్తూరు జాతీయ రహదారిపై దగ్గర కావడంతో విలువ ఎక్కువే.అక్కడ చింతకొమ్మదిన్నె రెవెన్యూ పరిధిలో సజ్జల కుటుంబం 130 ఎకరాలు పట్టా భూములను కొనుగోలు చేశారు.
Sajjala Ramakrishna Reddy: ఆ భూమి మొత్తం ఫారెస్ట్ భూముల దగ్గర ఉండడంతో పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూమిని బారీగా ఆక్రమించి తమ పేరుమీద పట్టా భూమిగా మార్చుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతోంది.రిజర్వ్ ఫారెస్ట్ భూములకు ఫారెస్ట్ అధికారులు ఎలా ఎన్వోసి ఇచ్చారు రెవెన్యూ అధికారులు ఎలా బదలాయించారే ప్రశ్నలు ఇప్పుడు రేకిస్తున్నాయి.గత ఐదేళ్లలో తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగులు ఇచ్చి ఇష్టానుసారంగా దోచుకున్నారు.40 ఎకరాలకు పైగా రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించారని ప్రాధమికంగా తెలిసిన వందల ఎకరాల భూము ఉంటుందని అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అధికారులకు తెలిసే అవకాశం ఉంటుంది.రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు విచారణ చేపడితే మాత్రం మరో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.