Plane Crash

Plane Crash: కుప్పకూలిన విమానం.. 72 మంది ప్రయాణికులు..

Plane Crash: కజకిస్థాన్‌లోని అక్టౌ ప్రాంతంలో ప్రయాణీకుల విమానం కుప్పకూలింది. చాలా మంది చనిపోయారని భయపడుతున్నారు. 72 మందితో ప్రయాణీకుల విమానం అజర్‌బైజాన్‌లోని బాకు నుండి రష్యాకు బయలుదేరింది. కజకిస్థాన్‌లోని అక్టౌ ప్రాంతంలో విమానం కూలిపోయింది. కూలిపోయే ముందు విమానం చాలాసార్లు చక్కర్లు కొట్టింది. పైలట్ చాలా సేపు ప్రయత్నించినా ప్రమాదం తప్పలేదు. మొత్తం 72 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న విమానం కిందపడి మంటలు అంటుకున్న వీడియో ఫుటేజీ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెంది ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. సాంకేతిక లోపం వల్లే విమానం కూలిపోయిందని ప్రాథమిక సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *