Kraven The Hunter: వరల్డ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు హాలీవుడ్ హార్ట్ థ్రాబ్ టేలర్ జాన్సన్. స్ట్రిక్ట్ డైట్ తో, కఠినమైన వ్యాయామంతో చక్కని ఫిజిక్ ను సొంతం చేసుకున్నాడు. అతను నటించిన తాజా చిత్రం ‘క్రావెన్ ది హంటర్’ జనవరి 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. సోనీ పిక్చర్ ఎంటర్ టైన్ మెంట్స్ దీనిని రిలీజ్ చేస్తోంది. ‘క్రావెన్ ది హంటర్’ యాక్షన్ తో కూడుకున్న ఆర్ రేటెడ్ మూవీ అని మేకర్స్ తెలిపారు. ఆరోన్ టేలర్ జాన్సన్ తండ్రిగా ఈ సినిమాలో రస్సెల్ క్రోవ్ చేశాడు. అతనో భయంకరమైన గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. తండ్రి కారణంగా క్రావెన్ ఎలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనేది ఇందులో దర్శకుడు జె.సి. ఆసక్తికరంగా చూపించాడు. ఇందులో చాందోర్, అరియానా డిబోస్, ఫ్రెడ్ హెచింగర్, అలెశాండ్రో నివోలా, క్రిస్టోఫర్ అబాట్ ఇతర కీలక పాత్రలు పోషించారు.