Pawan Kalyan: గిరిజనుల డోలీ కష్టాలను చూసి చలించాడు.. నేడు అధికారంలోకి వచ్చాక వారి కష్టాలను తీర్చేందుకు స్వయంగా వెళ్లాడు.. వందల కోట్లతో రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాడు.. ఆయన రాకతో ఆ గిరిజనం పులకించి ఆనందతాండవం చేసింది.. ఆ ఆనంద తాండవంలో తాను కలగలిసి నాట్యామాటాడు.. ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. నిన్న మన్యం పార్వతీపురం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం బాహుజాల గ్రామంలో 9.5 కోట్ల వ్యయంతో 9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.
Pawan Kalyan: ఈ రోజు అల్లూరి సీతారమరాజు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువు గిరిజన గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ఆయన రాకతో ఆ ఊరుఊరంతా పండుగే చేసుకుంటున్నది. సంబురాలు జరుపుకుంటున్నది.
Pawan Kalyan: గిరిజన గ్రామాల సమస్యలను చూసేందుకు కాలినడకన ఆయన వెళ్తుంటే గిరిజనం ఆయన వెంటే నడుస్తూ ఆనందం వెలిబుచ్చింది. 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని ప్రస్తుతం ఈ ప్రభుత్వం చేసి చూపిస్తున్నదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దారి వెంట ఓ ప్రదేశంలో గిరిజనుల సంప్రదాయ నృత్యం చేసి ఆడిపాడారు. వారితోపాటు పవన్ కల్యాణ్ నాట్యమాడుతూ వారితో సంబురం పంచుకున్నారు.