Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డు-2025 గురించి అయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మంగళగిరికి చెందిన ప్రతిభావంతులైన స్కేటర్ జెస్సీ రాజ్ మాత్రపు క్రీడల్లో ఆమె సాధించిన అత్యుత్తమ విజయాలకు గుర్తింపుగా 2025 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి జాతీయ బాలల అవార్డుకు ఎంపిక కావడం ఆంధ్ర ప్రదేశ్‌కు గర్వకారణం.
ఇది కూడా చదవండి: TS High Court: కేటీఆర్‌ను 30 వరకు అరెస్ట్ చేయొద్దు
ఈ నెల 26న ఢిల్లీలో ఆమె గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అవార్డును అందుకోనున్నారు. జెస్సీ రాజ్ మాత్రపు కేవలం తన తొమ్మిది ఏటా నుండే క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించారు, ఆమె అంకితభావం మన రాష్ట్రానికి గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది. జెస్సీ రాజ్ మాత్రపు యువ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చింది. ఇటీవల, ఆమె 62వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో సోలో డ్యాన్స్‌లో రజత పతకాన్ని గెలుచుకోవడం అందంగా ఉంది అని అయన అన్నారు.
It is a moment of immense pride for Andhra Pradesh that Mangalagiri’s talented skater, Jessy Raj Mathrapu, has been chosen for the Prime Minister’s National Child Award 2025 in recognition of her outstanding achievements in sports. She will receive the award from Hon’ble… pic.twitter.com/pKd5Iaw1AH
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2024