AP News: శ్రీ కృష్ణుడు అనుకున్నాడు ఏమో. ఆడవాళ్ళ జాకెట్లు మాయం చేస్తున్నాడు. ఇదేంటి దండ మీద ఆరేసిన మా జాకెట్లు ఏమైపోతున్నాయి అని ఆ ఊరి ఆడవారు కంగారు పడుతున్నారు. ఒకటి రెండు కాదు ఏకంగా మూడు వందలకు పైగా జాకెట్లు మిస్సింగ్. ఇంతకీ ..జాకెట్లు దొరికాయా ? హా దొరికాయి..జాకెట్లు కాదు..ఆ జాకెట్లు కొట్టేస్తున్న వాడు. ఇంతకీ ఎదనుకు కొట్టేస్తున్నాడో తెలుసు ? ఎం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియదు లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం …బలహీనత అంట ..
ఓ వ్యక్తి మహిళల జాకెట్లు అపహరించడం అందర్నీ అశ్చర్యానికి గురిచేసింది. ఆ వింత దొంగని పోలీసులు పట్టుకున్నారు. అసలు ఎందుకు ఇలా జాకెట్లు దొంగతనం చేశావు అని పోలీసులు ప్రశ్నించగా, అది తన బలహీనత అంటూ కాళ్లపై పడ్డాడు. ఏం కేసు పెట్టాలో ఏంటో తెలియక పోలీసులు నిందితుడుకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.
AP News: దొంగతనం అరవై ఆరు కళల్లో ఒకటి.. శ్రీ క్రృష్ణుడు సైతం గోపికల వస్త్రాలు అపహరించేవాడు. గోపికలతో ఆడుతూ వారిని ఆటపట్టించేవారట. ఇలాంటి సరదా సన్నివేశాలు చాలా సినిమాల్లో నది గట్టుపై తమ వస్త్రాలు ఉంచి స్నానం చేస్తుండగా అక్కడ ఉన్న వాటిని హీరో తీసుకుని వెళ్లి హీరోయిన్ను ఏడిపించడం సీతాకోకచిలుక సినిమాలో హీరో మురళి, ముచ్చెర్ల అరుణ మధ్య డైలాగులు హాస్యాన్ని పండిస్తూనే సీన్లో హీరోయిన్లో ఆవేశాన్ని రేకెత్తిస్తాయి.
ఇలాంటి ఘటనలు చూశాడో విన్నాడో , లేదా పురాణ పురుషులు స్ఫూర్తితనో, హీరోలు – విలన్ల ప్రభావంతోనో ఓ వ్యక్తి మహిళల జాకెట్లు అపహరించటం మొదలు పెట్టాడు. మూడు నెలల పాటు ముప్పు తిప్పలు పెట్టిన అతడిని పట్టుకుని ఫైనల్గా గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. ఏంటిరా ఈ పని బుద్ధి లేదా అని సదరు నిందితుడిని ఖాకీలు అదిలిస్తే అది తన బలహీనత అంటూ కాళ్లపై పడ్డాడు. ఏం కేసు పెట్టాలో ఏంటో తెలియక పోలీసులు నిందితుడుకి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటివి చేస్తే యాక్షన్ సీరియస్గా ఉంటుందని హెచ్చరించి పంపారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.
AP News: పశ్చిమగోదావరి జిల్లా తీరప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేగింది. తమ ఇళ్లలో ఖరీదైన వస్తువులు ఏవీ పోకుండా కేవలం జాకెట్లు మాత్రమే మాయం అవుతుండటంతో మహిళలు పొరుగు వారిపై సైతం అనుమానం పడ్డారు. ఇలా గ్రామంలో వాదోపవాదాలు, తగువులు కూడా జరిగాయి. ఫైనల్గా దొంగ దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
