Lagacharla:

Lagcherla: కంది జైలు నుంచి 17 మంది ల‌గ‌చ‌ర్ల రైతుల విడుద‌ల‌

Lagcherla: అధికారుల‌పై దాడి కేసులో సంగారెడ్డి జిల్లా కంది సెంట్ర‌ల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మ‌రో 17 మంది రైతులు శుక్ర‌వారం విడుద‌లయ్యారు. ఇప్ప‌టికే గురువారం కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్‌రెడ్డి విడ‌దుల‌య్యారు. ఈ 17 మంది కూడా గురువార‌మే విడుద‌ల కావాల్సి ఉండ‌గా, బెయిల్ ప‌త్రాలు ఆల‌స్యంగా అంద‌డంతో ఈ రోజు విడుద‌ల కావాల్సి వ‌చ్చింది.

Lagcherla: ల‌గ‌చ‌ర్ల దాడి కేసులో వారంతా 37 రోజుల‌పాటు జైలులో రిమాండ్‌లో ఉన్నారు. జైలు బ‌య‌ట‌కు రాగానే వారంతా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. గిరిజన సంఘాల, బీఆర్ఎస్ నేత‌లు వారికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ష‌రతుల‌తో కూడిన బెయిల్ మంజూరైంది. దీంతో వారంతా రూ.20 వేల చొప్పున పూచీక‌త్తును స‌మ‌ర్పించారు. ప్ర‌తివారం పోలీసుల ఎదుట హాజ‌రుకావాల‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌ధాన నిందితుడు బోగ‌మోని సురేశ్‌, మ‌రో ఏడుగురికి బెయిల్ మంజూరు కాలేదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *