Maha Kumbh Mela

Maha Kumbh Mela: నా భార్య గర్భిణీ! సెలవు కావాలి.. ఏకంగా 700 మంది పోలీసుల లీవ్

Maha Kumbh Mela: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 2025లో జరగనున్న మహా కుంభమేళా కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు హాజరవుతారని, వారి భద్రత కోసం వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది పోలీసులను మోహరించారు. మహాకుంభానికి దాదాపు 6 వేల మంది పోలీసులను కేటాయించగా, అక్టోబర్ 25 నుంచి మోహరింపు ప్రారంభించారు. వీరిలో 1200 మంది సిబ్బంది డిసెంబర్‌లో సెలవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

సెలవు కోసం దరఖాస్తు చేసుకున్న 1,200 మంది పోలీసులలో సగానికి పైగా అంటే 700 మంది పోలీసులు ఒకే కారణాన్ని పేర్కొనడం గమనార్హం.  తన భార్యకు ప్రసవం లేదా అనారోగ్యం కారణంగా వీరు సెలవు అడిగారు.  కొంతమంది పోలీసుల భార్యలు జనవరిలో ప్రసవిస్తే, మరికొందరు డిసెంబర్‌లో ప్రసవించే అవకాశం ఉందని తమ లీవ్ అప్లై చేశారు. 

ఇది కూడా చదవండి: Lagcherla: కంది జైలు నుంచి 17 మంది ల‌గ‌చ‌ర్ల రైతుల విడుద‌ల‌

Maha Kumbh Mela: మహాకుంభ భద్రతా ఏర్పాట్లను చూస్తున్న అధికారులను ఈ అసాధారణ ధోరణి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పోలీసులలో ఎక్కువ మంది 2018 – 2023లో రిక్రూట్ అయిన కానిస్టేబుళ్లే. ఉత్తరప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల పోలీసులు మోహరింపులో భాగంగా ఉన్నారు. దీంతో పాటు తల్లిదండ్రుల అనారోగ్యం కారణంగా 250 మంది పోలీసులు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు బంధువుల ‘తెహ్రవి’ (మరణం తర్వాత 13వ రోజు కార్యక్రమం) లేదా ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కావడం వంటి వివిధ కారణాలతో సెలవు కోరారు.

ఇది కూడా చదవండి: Paritala Ravi: పరిటాల రవి హత్య కేసు.. నిందితులకు బెయిల్

మహా కుంభ మేళా:

Maha Kumbh Mela: జనవరి 13న పౌష్ పూర్ణిమ స్నానంతో మహా కుంభమేళా ప్రారంభమవుతుంది. కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ కోసం 2019 కుంభమేళాలో నమోదైన 25 కోట్ల మందిని అధిగమించి 40 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *