KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రేస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా? లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.ఫార్ములా ఈ రేస్ విషయంలో అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కూడా అవినీతి జరగలేదని, కేవలం ప్రాజెక్టు నిర్వహణలో లోపాలున్నాయని మాత్రమే చెప్పారని గుర్తు చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు గురించి చెప్పాలన్నారు.క్యాబినెట్ సబ్ కమిటీ రిసోర్స్ మోబిలైజేషన్ అని ఉండేది.. దానికి హరీష్ రావు చైర్మన్ ఉండేదన్నారు. ఓఆర్ఆర్ పై టీఓటీ విధానంపై మేము రూ.7400 కోట్లు తెచ్చి రైతు రుణమాఫీ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ టీఓటీని పారదర్శకంగా చేయడం జరిగిందన్నారు. ఆనాడు ఇదే ముఖ్యమంత్రి ఎంపీగా ఉండి లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు.. దానికి హెచ్ఎండీఏ రేవంత్ రెడ్డి పై పరువునష్టం దావా వేశారని కేటీఆర్ గుర్తుచేశారు. అంతేకాదు ఇప్పుడు పదే పదే కుంభకోణం జరిగిందని అన్నారు కదా.. మరి ఆ పర్మిషన్ రద్దు చేయలేదన్నారు. ఓఆర్ఆర్ పై సిట్టింగ్ జడ్జ్ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు.
