Aam Aadmi Party

Aam Aadmi Party: హామీ అదిరింది.. 60 ఏళ్లకు పైబడిన వారికి ఉచిత వైద్యం

Aam Aadmi Party: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం వృద్ధులకు సంజీవని పథకాన్ని ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. ఏ కేటగిరీలో ఉన్నా వృద్ధులందరికీ ఈ చికిత్స ఉచితం అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

గతంలో కేజ్రీవాల్ వృద్ధులకు రూ.2500, ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల వరకు బీమా, మహిళలకు నెలకు రూ.1000 చొప్పున అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రస్తుత పదవీకాలం 23 ఫిబ్రవరి 2025తో ముగుస్తుంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగొచ్చు. చివరి అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 2020లో జరిగాయి.  ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ సంపూర్ణ మెజారిటీ అంటే 70 సీట్లలో 62 గెలుచుకుంది.

ఇది కూడా చదవండి: Pregnancy Problems: మహిళల్లో సంతానలేమి సమస్యలు . . కారణాలు ఇవే కావచ్చు . .

Aam Aadmi Party: డిసెంబర్ 12న, కేజ్రీవాల్ మహిళలకు ప్రతి నెల ₹1000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనికి మహిళా సమ్మాన్ యోజన అని పేరు పెట్టారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళ ఈ పథకం పరిధిలోకి వస్తారు. ఎన్నికల తర్వాత మహిళలకు ప్రతినెలా ఇచ్చే మొత్తాన్ని ₹2100కి పెంచుతామని కేజ్రీవాల్ తెలిపారు.

డిసెంబర్ 10న ఆటో డ్రైవర్ల కోసం కేజ్రీవాల్ 4 ప్రకటనలు చేశారు. ఆటో డ్రైవర్ కూతురి పెళ్లికి రూ.లక్ష ఇస్తానని చెప్పారు.  హోలీ, దీపావళి రోజుల్లో యూనిఫాం కోసం మరో రూ.రెండున్నర వేలు ఇస్తారు. రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా కూడా వారికీ అందిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆటోడ్రైవర్ల పిల్లలకు కోచింగ్ ఇచ్చేందుకు డబ్బులు కూడా ఇస్తారు.

ఇది కూడా చదవండి: High Court: పోలీసుల అతికి హైకోర్టు చెక్‌!

Aam Aadmi Party: వృద్ధుల పెన్షన్ పథకాన్ని నవంబర్ 21న పునఃప్రారంభిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. కొత్తగా 80 వేల మంది వృద్ధులను ఈ పథకంలో చేర్చారు. గతంలో ఈ పథకం ద్వారా 4.50 లక్షల మంది లబ్ధి పొందేవారు. ఇప్పుడు ఈ పథకం పరిధిలోకి ఐదు లక్షల మందికి పైగా వృద్ధులు వస్తారు.

60 నుండి 69 సంవత్సరాల మధ్య ఉన్న సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా రూ.2000 ఇస్తారు.  70 ఏళ్లు పైబడిన వృద్ధులకు నెలకు రూ.2500 అందజేస్తారు. ఈ పథకాన్ని ప్రకటించిన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ – పెద్దల ఆశీర్వాదంతో జైలు నుంచి బయటకు వచ్చానని చెప్పారు. వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ పథకం అందిస్తున్నారు ప్రకటించారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *