Naganna Trailer

Naganna Trailer: విడుదలైన ‘నాగన్న’ ట్రైలర్

Naganna Trailer: మహేష్ కుమార్ హీరోగా, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘నాగన్న’. ఈ మూవీకి సతీష్ కుమార్, మహేష్ కుమార్ ఇద్దరు దర్శకత్వం వహిస్తున్నారు. సింధు సిరి, చందన, రూప, జనార్దన్, స్వాతి ఘట్కర్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Siddhu Jonnalagadda: ఏప్రిల్ 10న ‘జాక్’గా రాబోతున్న సిద్ధు జొన్నలగడ్డ

Naganna Trailer: వీరి సమక్షంలో 18వ తేదీన మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ సమావేశంలో డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆదిత్య మ్యూజిక్ లో పాటలు వచ్చేలా కృషి చేసిన నిరంజన్, మాధవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమా బాగా రావడానికి నిర్మాత నెక్కంటి నాగరాజ్ ఎంత సహకారం అందించారని అన్నారు. పక్కా ప్లానింగ్ తో తొమ్మిది రోజుల్లో మూవీ షూటింగ్ ను పూర్తి చేశామని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత నాగరాజ్ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *