Srinivasa Varma: రాష్ట్రంలో మత్స్య సంపద వినియోగాన్ని పెంచాలి

Srinivasa Varma:

– రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించిన కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ
– ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.
– మత్స్యకార ఉత్పత్తుల స్టాల్స్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు
– మత్య్స ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న ఎంపీ వేమిరెడ్డి
– నెల్లూరు చేపల పులుసుకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది
– చేపల ఎగుమతుల్లోనే కాదు.. వినియోగంలో కూడా ముందుండాలి
– రాబోయే రోజుల్లో మరింత గొప్పగా ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్ నిర్వహణ – ఎంపీ

దైనందిత ఆహారపు అలవాట్లలో మత్స్య సంపద వినియోగాన్ని గణనీయంగా పెంచాల్సిన ఆవశ్యకత చాలా ఉందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. నెల్లూరు వి ఆర్ సి గ్రౌండ్స్ లో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ, మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన 3వ రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రారంభించారు. ముందుగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి శాసన సభ్యులు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తిన కార్తీక్, మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోలయ్య వెంటారాగా మత్స్య నారాయణస్వామి చిత్రపటానికి పూలమాలలతో గౌరవించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వివిధ మత్స్యకార ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించి వారితో ఆప్యాయంగా మాట్లాడారు.

Also Read: ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే.. 

Srinivasa Varma: అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ అనేక వ్యాధులకు విరుగుడుగా ఆహారపు అలవాట్లలో చేపలు, రొయ్యలు తదితర సముద్ర ఉత్పత్తులను ఉపయోగించాలని వైద్యులు సైతం సలహాలిస్తున్నారన్నారు. ముఖ్యంగా అల్జీమర్స్, పార్కిన్ సన్స్ వంటి దీర్ఘకాల వ్యాధుల బారిన
పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా చేపలు తినాలన్నారు. జ్ఞాపక శక్తి పెంపొందేందుకు ఆహారంలో చేపలు తప్పనిసరన్నారు. అందుకోసమే మత్స్య సంపద వినియోగాన్ని పెంచుటకు ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్స్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని తీసుకువచ్చి, కోట్లాది రూపాయల నిధులను కేటాయించి మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నామన్నారు. అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో కూడా మత్స్యకారులను చేర్చడం జరిగిందన్నారు. అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలో తమిళనాడుకు చెందిన కడలూరు మత్స్యకారులు మరబోట్లు వినియోగించి మత్స్య సంపదను దోచుకుంటున్న విషయాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన దృష్టికి తెచ్చారని, ఈ విషయాన్ని కేంద్రంలోని సంబంధిత శాఖల మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

ALSO READ  Tongue Health: నాలుకను బట్టి ఆరోగ్య సమస్య చెప్పొచ్చు..? కానీ...

Srinivasa Varma: అనంతరం టౌన్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశాన్ని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి శాసనస భ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం కింద లక్షలాది కోట్ల రూపాయలు రాష్ట్రాలకు అందించడం జరుగుతుందన్నారు. మత్స్యకారులకు రాయితీలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్స హిస్తుందన్నారు. రాష్ట్రంలో పోర్టులు, జెట్టీలు, ఫిష్ లాండ్స్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మత్స్యకారులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో ప్రజలకు చేపల వాడకం, దానివల్ల కలిగే ప్రయోజనాల మీద పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రం నుండి ఇతర దేశాలకు ఎగుమతులు చేసే చేప ఉత్పత్తులతో విరివిగా మందులు తయారు చేయడం జరుగుతుందన్నారు.

Also Read:  హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Srinivasa Varma: ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే నెల్లూరు చేపల పులుసుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. నెల్లూరు తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. కడలూరు నుండి చేపల వేటకు నెల్లూరు ప్రాంతానికి కొచ్చే మత్స్యకారు లను రాకుండా అందుకు తగిన విధంగా పెద్ద మర బోట్లు వినియోగించినట్లయితే నిరోధించడానికి అవకాశం ఉంటుందన్నారు. తన ఈ విషయమై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఆరోగ్యానికి చేప మించినది మరొకటి లేదన్నారు. రాబోయే రోజుల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్స్ ను రాష్ట్ర స్థాయిలో పెద్దఎత్తున నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అదేవిధంగా మన రాష్ట్రం మత్య్స ఉత్పత్తుల్లో ప్రధనమస్థానంలో ఉన్నా.. వినియోగంలో మాత్రం వెనుకబడే ఉందన్నారు. ఈ స్థితిలో మార్పురావాలని, తప్పకుండా ప్రజలకు వీటిపై అవగాహన కల్పించి వినియోగం పెంచాలన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టుకు కంటైనర్లు తిరిగే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కృష్ణపట్నం పోర్టుకు కంటైనర్లు ఆపడం వల్ల వెయ్యి కోట్లు ఆదాయం ప్రభుత్వానికి నష్టం జరిగిందని అలాగే పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని ఆయన అన్నారు. తమిళనాడు కడలూరు నుండి మత్స్యకారులు వేటకు ఈ ప్రాంతానికి రావడం వల్ల మత్స్యకారులు మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరులో ఓడరేవును ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రికి ఆయన తెలియజేశారు.

ALSO READ  Allu Arjun: థమ్స్ అప్ షూట్ లో అల్లు అర్జున్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *